రాయ్‌పూర్‌లో 10 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌

రాయ్‌పూర్‌లో 10 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌

దేశంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు పలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కొత్త కేసులు వస్తుండటంతో ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్న ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని నగరం రాయ్‌పూర్‌లో 10 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ 9 నుంచి 19వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఒక్క రాయ్‌పూర్‌లోనే  ప్రస్తుతం 13,107 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కరోనా కేసులపై ఆ రాష్ట్ర సీఎం భూపేశ్‌ బఘెల్‌ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అత్యవసరం అనుకుంటేనే ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలని సూచించారు. మాస్కులు ధరించాలని, కరోనా రూల్స్ పాటించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.