
సమస్యల్ని పరిష్కరించాలని, డిమాండ్లని నెరవేర్చాలని కొంతమంది వెరైటీగా పోరాటం చేస్తుంటారు. ఛత్తీస్గఢ్కి చెందిన రమాశంకర్ గుప్తా కూడా ఇదే కోవకు చెందుతాడు. తమ ఊరిని జిల్లా చేసేంత వరకు గెడ్డం గీసుకోవద్దని డిసైడ్ అయ్యిండు. ఈమధ్యే వాళ్ల ఊరు జిల్లా అయింది. దాంతో 21 ఏండ్ల తర్వాత గెడ్డం గీసుకున్నాడు. రమాశంకర్.. ఆర్టీఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) యాక్టివిస్ట్. ఉండేది మనేంద్రగఢ్లో. చత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కొరియా ప్రాంతాన్ని జిల్లా చేశారు. ఈ ప్రాంతాన్ని కొరియా జిల్లాలో కలిపారు. దాంతో మనేంద్రగఢ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు తమ ప్రాంతాన్ని జిల్లాగా మార్చాలని పోరాటం మొదలుపెట్టారు.
రమా శంకర్ కూడా ఎమ్మెల్యేలకు రిక్వెస్ట్ లెటర్స్ ఇచ్చేవాడు. అంతేకాదు, ఎవరిని కలిసినా ఇదే విషయం గురించి మాట్లాడేవాడు. పోయిన ఏడాది ఆగస్టులో మనేంద్రగఢ్ చిర్మిరి భరత్పూర్ని జిల్లాగా ప్రకటించింది గవర్నమెంట్. అయితే, జిల్లాగా ఏర్పడిన రోజే గెడ్డం గీసుకోవాలని ఏడాదిగా ఎదురుచూశాడు. సెప్టెంబర్ 9వ తేదీన32వ జిల్లాగా ఏర్పడింది. దాంతో తన కల నెరవేరినందుకు సంతోషంగా గెడ్డం గీసుకున్నాడు. ‘‘మా ప్రాంతాన్ని జిల్లా చేయాలని నలభై ఏండ్లుగా పోరాటం చేస్తున్నాం. ఒకవేళ మా ప్రాంతం జిల్లా కాకుంటే ఎప్పటికీ గెడ్డం గీసుకోవద్దనుకున్నా” అని చెప్పాడు రమాశంకర్.