బోరుబావిలో పడ్డ బాలుడు.. సహాయక చర్యలు ముమ్మరం

 బోరుబావిలో పడ్డ బాలుడు.. సహాయక చర్యలు ముమ్మరం

ఛత్తీస్ గఢ్ జాంజ్ గిరి చంపాజిల్లాలో బోరుబావిలో పడ్డ బాలుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 80 అడుగుల లోతైన బోరుబావిలో పడ్డ బాలుడి కోసం రెండు రోజులుగా అధికారులు శ్రమిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యల్లో పాల్గొన్నాయి. బారుబావికి సమాంతంగా జేసీబీలతో 50 అడుగుల లోతు గుంతలు తవ్వుతున్నారు. సహాయక చర్యలను ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. బాలుడిని ఎలాగైనా కాపాడాలంటూ అధికారులను ఆదేశించారు. పిహ్రిద్ గ్రామంలో శుక్రవారం ఆడుకుంటూ రాహుల్ సాహు అనే బాలుడు ప్రమాదవశాత్తు బోరువావిలో పడ్డాడు. బోరుబావికి సమాంతరంగా 65 అడుగులు తవ్వి.. ఆ తర్వాత సొరంగం ఏర్పాటుచేస్తామని అధికారులు తెలిపారు.