ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో ఛెత్రి సూపర్‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌

ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో ఛెత్రి సూపర్‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌

హాంగ్జౌ: ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ బోణీ చేసింది. గురువారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎ రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 1–0తో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌పై నెగ్గింది. సునీల్‌‌‌‌‌‌‌‌ ఛెత్రి (85వ ని.) ఏకైక గోల్‌‌‌‌‌‌‌‌ చేశాడు. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో చైనా చేతిలో 1–5తో ఓడిన ఇండియా ఈ పోరులో మాత్రం ఆకట్టుకుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లింది.

అయితే 9వ నిమిషంలోనే గోల్‌‌‌‌‌‌‌‌ చేసే చాన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చినా వృథా చేసుకుంది. రోహిత్‌‌‌‌‌‌‌‌ డాన్‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన పాస్‌‌‌‌‌‌‌‌ను ఛెత్రి గోల్‌‌‌‌‌‌‌‌గా మల్చలేకపోయాడు. తర్వాత బంగ్లా ఎదురుదాడికి దిగడంతో గోల్స్‌‌‌‌‌‌‌‌ అవకాశాలు సన్నగిల్లాయి. అయితే రెండో అర్ధభాగంలో షార్ట్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌లతో వేగంగా కదిలిన ఛెత్రిసేన బంగ్లాను కట్టడి చేసింది.

ఈ క్రమంలో సహచరుడు ఇచ్చిన క్రాస్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌ను అందుకున్న ఛెత్రి నేర్పుగా ప్రత్యర్థి గోల్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌లోకి పంపి విజయాన్ని అందించాడు.