Chicken Price : పాకిస్థాన్లో కిలో చికెన్ రూ.650

Chicken Price : పాకిస్థాన్లో కిలో చికెన్ రూ.650

పాకిస్థాన్‭లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకప్పుడు కేజీ చికెన్ రేటు రూ.200 లేదా 300 ఉండేది ఇప్పుడు ఏకంగా రూ.650కి చేరింది. దీంతో ధరలు చూసి నాన్ వెజ్ ప్రియులు నోరెళ్లబెడుతున్నారు. పౌల్ట్రీ ఫీడ్ ధరల పెరుగుదల కారణంగా పాకిస్తాన్ లో చికెన్ ధరలు 100 శాతానికిపైగా పెరిగాయి. ఇక ఇస్లామాబాద్‭లో గత నెల వరకూ కిలో చికెన్ రూ.350కి అమ్మారు. ఇప్పుడు అది కిలో రూ.650కి చేరడంతో ప్రజల నిరసనకు దారి తీసింది. మరోవైపు పాక్ లో ద్రవ్యోల్పణం భారీగా పెరగడంతో పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి.

కరాచీ, పెషావర్, లాహోర్‭లలో పెరిగిన ధరలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్‭లో పరిస్థితి చూస్తే.. రానున్న రోజుల్లో నాన్ వెజ్ ధరలు మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే చికెన్ ధర కిలోకు రూ.800 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అయితే గతేడాది అక్టోబర్ నుంచి చికెన్ ఫీడ్ ధరలు భారీగా పెరగడం వల్లే ప్రస్తుతం కోడి మాంసం ధరలు పెరిగాయని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్థాన్ లో నాన్ వెజ్ ఒక్కటే కాదు.. పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌, కరెంటు రేట్లు ఆకాశానికి ఎగబాకాయి.