న్యాయం కోసం చిదంబరం తరపున పోరాడుతాం: ప్రియాంక

న్యాయం కోసం చిదంబరం తరపున పోరాడుతాం: ప్రియాంక

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియంగా గాంధీ సీబీఐ చర్యలను ఖండించారు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత చిదంబరం ఏళ్లపాటు దేశానికి సేవ చేసిన వ్యక్తి అలా అగౌరవపరచడం అన్యాయమన్నారు. రాజకీయ కక్ష్యసాధింపు చర్యలో​ భాగంగా చిదంబరాన్ని తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఆమె ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. అత్యంత గౌరవనీయులైన రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం. దశాబ్దాలుగా ఆయన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఆర్థిక, హోం మంత్రిగా ఆయన దేశానికి ఎనలేని సేవ చేశారు. బీజేపీ ప్రభుత్వ తప్పిదాలపై ఆయన మాట్లాడినందుకు కుట్ర పూరితంగా కేసుల్లో ఇరికేంచే  ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సిగ్గుమాలిన చర్యఇది. చిదంబరం పట్ల  సీబీఐ తీరు అవమానకరమైంది. మేం ఆయనకు మద్దతుగా నిలుస్తాం. న్యాయం కోసం ఆయన తరఫున పోరాడతామంటూ ప్రియాంకా ట్విట్టర్ లో స్పష్టం చేశారు.