సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక కామెంట్లు 

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక కామెంట్లు 

కేసు ఫైల్ వెంటలేని లాయర్.. 
బ్యాట్ లేని సచిన్
సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్ 

న్యూఢిల్లీ : ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక కామెంట్లు చేశారు. కేసు ఫైల్ లేకుండా విచారణకు హాజరైన లాయర్ ను ఉద్దేశించి.. ‘‘కేసు ఫైల్ లేకుండా లాయర్ విచారణకు రావడమంటే.. బ్యాట్ లేకుండా సచిన్ టెండూల్కర్ ఆటకు వెళ్లినట్లు ఉంటుంది” అని కామెంట్ చేశారు. శుక్రవారం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ ల బెంచ్ ఓ కేసును విచారించింది.

అప్పుడు ప్రతివాది లాయర్​ను కేసు గురించి వివరించాలని కోరగా.. ఆయనేం చెప్పలేకపోయారు. ఆయన దగ్గర కేసు ఫైల్ కూడా లేనట్లు బెంచ్ గుర్తించింది. ‘‘కేసు ఫైల్ వెంటలేని లాయర్.. బ్యాట్ వెంటలేని సచిన్ టెండూల్కర్​ల ఉంటారు. ఇదేం బాగుం డదు. మీరు గౌన్ వేసుకున్నారు. బ్యాండ్ పెట్టుకున్నారు. చేతిలో పేపర్లు లేవు. కేసు ఫైల్ ఎప్పుడూ మీ వెంటే ఉంచుకో వాలి” అని సీజేఐ సూచించారు.