తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 

V6 Velugu Posted on Jun 10, 2021

  • ఘన స్వాగతం పలికిన టీటీడీ

తిరుపతి: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల చేరుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ శ్రీ ఎన్.వి రమణకు  శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద  టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే  భూమన కరుణాకర్ రెడ్డి ,ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో  ఎవి ధర్మారెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
 అనంతరం  శ్రీవారి దర్శనం కోసం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్ రమణకు  చైర్మన్, ఈవో, అదనపు ఈవో స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ సతీ సమేతంగా స్వామివారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత కుమారి, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి  రవీంద్ర బాబు, తిరుపతి అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు, ప్రోటో కాల్ మేజిస్ట్రేట్ పవన్ కుమార్, డిఐజి  క్రాంతి రాణా టాటా, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సెక్యూరిటీ) గోపీనాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్.పి వెంకట అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Tagged , tirupati today, tirumala today, supreme court Chief Justice in tirumala, Supreme Court CJ N V RAMANA

Latest Videos

Subscribe Now

More News