సిటీల ఆటలంటే ఇక్కడ్నే!

సిటీల ఆటలంటే ఇక్కడ్నే!

పిల్లలంటేనే  అల్లరి, ఆటలు. ఊళ్లలో ఉండే పిల్లలకైతే రకరకాల ఆటలు ఆడుకునే వెసులుబాటు, ప్లేసు ఉంటాయి. మరి సిటీలో? పిల్లల్ని ఆడించే టైమ్‌ దొరకడమే  ల్లిదండ్రులకు కష్టం.అలాంటి వాళ్లకోసమే గేమింగ్‌ జోన్‌ లు రోజురోజుకీ  పెరిగిపోతున్నాయి. పెద్ద పెద్ద షాపిం గ్‌ మాల్స్‌ అన్నిం ట్లో పిల్లల కోసమే ప్రత్యేకంగా గేమింగ్‌ జోన్‌ లు తీసుకొస్తు న్నారు. ఇటు పిల్లలు ఆడుకోవచ్చు, వాళ్లను తీసుకొచ్చే పెద్దవాళ్లు చక్కగా షాపిం గ్‌ చేసుకోవచ్చు. అందుకే ఇది సిటీలో మంచి బిజినెస్‌ ఇప్పుడు. సెలవొస్తే చాలు, గేమింగ్‌ జోన్స్‌ ఉన్న షాపిం గ్‌ మాల్స్‌ కు క్యూ కట్టేస్తు న్నారు.

ఒక్కసారైనా ఆడాలి..ఇప్పుడు షాపింగ్‍ మాల్స్‌ లో లేటెస్ట్‌ గా గేమింగ్ జోన్స్‌ కు క్యూ కడుతున్నారు. మల్టీ ప్లెక్స్‌ లు, సినిమా థియేటర్లలో కూడా ఈ గేమింగ్ జోన్స్ పలకరిస్తున్నాయి. దాంతో అటు షాపింగ్… ఇటు వీడియో గేమ్స్ ఆడుతూ సరదాగా గడుపుతున్నారు. ఈ గేమింగ్ సెంటర్లలో పెట్టిన డబ్బుకు ఎంజాయ్ మెంట్‌ తో పాటు మంచి మంచి గిఫ్ట్‌ లను కూడా గెలుచు కోవచ్చు. దీంతో మాల్స్ కు వెళ్లేవాళ్లు ఈ గేమ్స్ ఒక్క సారైనా ఆడాలి అనుకుంటారు.

వీడియో గేమ్స్

ముఖ్యంగా వీడియో గేమ్స్ పిల్లలను ఎంతగానో ఆకట్టుకుం టున్నాయి. కారు, బైక్, డెవిల్స్ షూట్ గేమ్స్ పిల్లలను ఆకర్షిస్తున్నాయి. ఫన్ గా సాగే బౌలింగ్ గేమ్…స్నూకర్స్ గేమ్స్.. స్కేరింగ్ హౌస్‌..రెయిన్ ఫారెస్ట్ వంటి గేమ్స్ మంచి థ్రిల్ ను ఇస్తున్నాయంటున్నారు. యూత్. గిర గిర తిరిగే రౌండ్ చెయిర్స్.. కార్టూన్ బొమ్మలతో కూడిన ఆటపాటలు.. కార్ రేసింగ్ లు ఇలా వారికి పూర్తి ఆనందా నిచ్చే గేమ్ జోన్స్ రెడీ అయ్యాయి.

మల్టీప్లెక్స్ ల్లో ..

ప్రస్తుతం సిటీలో ఐమ్యాక్స్, స్నోవరల్డ్, సిటీ సెంటర్ , ఇనార్బిట్ మాల్‍, ఐ నాక్స్ తో పాటు కొత్తగా ఏర్పాటు అవుతున్న మల్టీ ప్లెక్స్ ల్లో ఈ ఫన్ గేమింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తున్నారు.. వారమంతా తమ పిల్లలు స్కూళ్లూ ..ట్యూషన్ లతో బిజీగా ఉంటారని..ఇలాంటి ఫన్ గేమ్స్ వల్ల పిల్లలు వారాంతంలో ఆనందంతో పాటు మరింత చురుకుగా ఉంటారంటున్నారు. ఇలా పిల్లలతో కలిసి వీకెండ్స్ నిఎంజాయ్ చేయడం చాలా సంతోషంగా ఉందని తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.

పబ్లిక్ లో అయితేనే..

గేమ్స్ జోన్ లో గేమ్ ను బట్టి వాటి ధర రూ.36 నుంచి ఉంటాయి. అయితే ఇప్పటికే ఇలాంటి ఫన్ గేమ్స్ మొబైల్స్..కంప్యూటర్స్ లో కూడా ఆడుతున్నారు. అయినాపబ్లిక్ ఎక్కువుండే ప్రదేశాల్లో ఉండే గేమ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు వాటి నిర్వాహకులు. పబ్లిక్ లో వస్తున్న రెస్పాన్స్ వల్ల మరిన్ని కొత్త గేమ్స్ ను ఈ సమ్మర్ స్పె షల్ గా లాంచ్ చేయనున్నట్టు వారుచెబుతున్నారు. ఇంట్లోనే కూర్ చుని ఫోన్లలో, ల్యాప్ టాప్ లలో గేమ్స్ ఆడకుండా పబ్లిక్‍ ప్లేస్ లకొచ్చి పిల్లలు ఆడుతుంటే వాళ్లకు బయట సంబంధాలు మెరుగవుతాయంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు.