ఏమన్నా క్రియేటివిటా?

ఏమన్నా  క్రియేటివిటా?

ఓసారి ఫొటోను చూడండి. పోరగాళ్లు క్యారం ఆడుతున్నట్టుంది కదా. అయితే మీరు సక్కగ సూడలేదన్నట్టే. మళ్లోసారి సూడండి. వాళ్లాడుతున్నది క్యారమే. కానీ బోర్డుపైన కాదు. నేలపైన. ఏమన్నా క్రియేటివిటా? బురద మట్టిని చక్కగా చదును చేసి క్యారం బోర్డులా తయారుచేసుకున్నారు. బోర్డునే కాదు. కాయిన్స్‌‌‌‌నూ వాళ్లే రెడీ చేసుకున్నారు. వాటర్‌‌‌‌ బాటిల్స్‌‌‌‌ క్యాప్స్‌‌‌‌ను వాడారు. బిజినెస్‌‌‌‌ మ్యాన్‌‌‌‌ ఆనంద్‌‌‌‌ మహీంద్రా ఈ ఫొటోను ట్వీట్‌‌‌‌ చేసి.. ‘ఇండియాలో క్రియేటివిటీకి కొదవలేదు’ అని కామెంట్‌‌‌‌ పెట్టారు.