పార్కులో పులి పిల్లతో చిన్నారి గేమ్స్.. షాక్ అయిన నెటిజన్లు..

పార్కులో పులి పిల్లతో చిన్నారి గేమ్స్.. షాక్ అయిన నెటిజన్లు..

మీరట్‌లోని షాజహాన్‌పూర్ ప్రాంతంలో ఓ ఇంట్రస్టింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. పార్కులో పిల్లలు ఆడుకుంటుండగా.. ఓ చిరుతపులి పిల్ల కనిపించింది. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా సో,ల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ పిల్లవాడు చిరుత పిల్లను బలవంతంగా లాగడం చూడవచ్చు. పిల్లవాడు పిల్ల చుట్టూ తీగను కూడా కట్టాడు. ఈ సమయంలో చిరుతపులి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. జంతు హింసకు సంబంధించిన ఈ ప్రమాదకరమైన సంఘటన రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయిన కొద్దిసేపటికే, మీరట్ ఫారెస్ట్ డివిజన్ ఒక ట్వీట్‌ చేసింది. “చిరుతపులి పిల్లను నిపుణుల పర్యవేక్షణలో ఈ రోజు ఉదయం 3.30 గంటలకు దాని తల్లితో తిరిగి కలిపారు” అని ట్విట్టర్ ద్వారా పేర్కొంది.

అంతరించిపోతున్న జాతిపై క్రూరత్వానికి సంబంధించిన కేసు

ఆవాసాల నష్టం, ఛిన్నాభిన్నం, శరీర భాగాలతో అక్రమ వ్యాపారం కోసం వేటాడటం, సాయుధ పోరాటాల ఫలితంగా హింసించడం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు జనాభా మనుగడకు రోడ్ల వల్ల కలిగే నష్టాన్ని లెక్కించే ఇటీవలి ప్రపంచవ్యాప్త అధ్యయనం ప్రకారం, చిరుతపులి (పాంథెరా పార్డస్) రోడ్ కిల్లింగ్ ఫలితంగా ఉత్తర భారతదేశంలో అంతరించిపోయే అవకాశం 83% ఎక్కువగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఉత్తర భారత చిరుతపులి జనాభా వచ్చే 50 ఏళ్లలో అంతరించిపోయే ప్రమాదం ఉంది. అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించబడిన నాలుగో జంతు జనాభాలో ఇది ఒకటి.

https://twitter.com/AhteshamFIN/status/1669604294876893187