పడిపోతున్న మిర్చి ధర.. రూ.12,850కి చేరిన క్వింటాల్‌‌ మిర్చి

పడిపోతున్న మిర్చి ధర.. రూ.12,850కి చేరిన క్వింటాల్‌‌ మిర్చి

ఖమ్మం టౌన్, వెలుగు : మిర్చి రోజురోజుకు పతనమవుతున్నాయి. ఈ ఏడాది మొదట్లో క్వింటాల్‌‌ రూ.20 వేలు పలికిన మిర్చి క్రమంగా తగ్గుతూ రూ. 13 వేలకు చేరింది. బుధవారం ఖమ్మం మార్కెట్‌‌కు 30 వేలు బస్తాలు రాగా రేటు మరింత తగ్గి జెండా పాటగా రూ. 12,850 మాత్రమే పలికింది. ట్రేడర్లు మిర్చి గ్రేడ్లను రూ. 12 వేల నుంచి రూ. 8 వేల వరకే కొనుగోలు చేస్తుండడంతో కనీసం కూలీ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చైనాతో పాటు ఇతర దేశాలకు ఎగుమతులు లేకపోవడం వల్లే మిర్చి రేట్లు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. శుక్రవారం నుంచి పత్తి, మిర్చి, ఆపరాలకు సంబంధించిన క్రయవిక్రయాలన్నీ పత్తి యార్డులోనే జరుగుతాయని ఖమ్మం మార్కెట్‌‌ సెక్రటరీ ప్రవీణ్‌‌రెడ్డి తెలిపారు.