బార్డర్‌‌లో చైనా కొత్త ఎత్తులు

బార్డర్‌‌లో చైనా కొత్త ఎత్తులు

లడఖ్‌‌‌‌‌‌‌‌లోని పాంగోంగ్ సోలో పెరుగుతున్న చైనా కదలికలు
తాజాగా తీసిన శాటిలైట్ ఇమేజెస్‌‌‌‌‌‌‌‌లో వెల్లడి

న్యూఢిల్లీ: దొంగదెబ్బ తీసే చైనా బుద్ధి ఇంకా మారలేదు. గల్వాన్ లోయలో జరిగిన గొడవతో అంతర్జాతీయంగా చీవాట్లు తిన్నా తన కుయుక్తులు మార్చుకోలేదు. లడఖ్ లోని పాంగోంగ్ సో ఏరియాలో చైనా ఆర్మీ డెప్లాయమెంట్స్ పెరుగుతున్నాయి. హై రెసొల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. దీంతో ఇప్పుడిప్పుడే సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా కనిపించడం లేదు.

చెప్పేదొకటి చేసేదొకటి
గత బుధవారం ఆ దేశ ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. ‘‘గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి కూల్ అవుతోంది. ఎస్కలేషన్ కొనసాగుతోంది’’ అని చెప్పారు. కానీ సరిహద్దుల్లో పరిస్థితి వేరుగా ఉంది. స్పేస్ సంస్థ మాక్సర్ టెక్నాలజీస్ జులై 29న తీసిన శాటిలైట్ ఇమేజ్ లను పరిశీలిస్తే.. ఫింగర్ 4లో సైన్యం కదలికలు కనిపించాయి. తాత్కాలికంగా సైనికులను విత్ డ్రా చేస్తున్నట్లు ప్రకటించినా.. తర్వాత అలాంటిదేమీ జరగలేదు. రోడ్ లెవెల్ ఏరియాల్లో సైనికులను విత్ డ్రా చేసినా.. ఫింగర్ ఫోర్ లోని టాప్ రిడ్జ్ లైన్లలో మాత్రం సైనికులు అలానే ఉన్నారు.

ఫింగర్ 5, 6లో కూడా
మరోవైపు ఫింగర్ 5, 6లో కూడా సైనికుల సంఖ్యను చైనా పెంచుతోంది. పాంగోంగ్ లేక్ వెంబడి ఫింగర్ 5, 6 ఏరియాల్లో డెప్లాయ్ మెంట్స్ ను పెంచినట్లు తాజా ఇమేజెస్ లో కనిపించింది. ఫింగర్ 6లో ప్రీ ఫాబ్రికేటెడ్ హట్స్, కొత్తటెంట్లు, స్టోరేజీ తదితర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫింగర్ 5లో అదనంగా మరిన్ని టెంట్లు ఏర్పాటు చేశారు. ఫ్లోటింగ్ డాక్, బోట్లు కనిపించాయి.

గల్వాన్‌‌‌‌‌‌‌‌ లో డిస్ ఎంగేజ్ మెంట్ కొనసాగుతున్నది
ఇక గల్వాన్ వ్యాలీలో ట్రూప్స్ డిస్ ఎంగేజ్ మెంట్ ప్రాసెస్ ఇంకా కొనసాగుతోంది. జులై 23న తీసిన ఇమేజెస్ లో విత్ డ్రా చేసుకోవడం కనిపించింది. ‘‘డిస్ ఎంగేజ్ మెంట్ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదు. దీన్ని పూర్తి చేసేందుకు చైనా వాళ్లు మాతో సిన్సియర్ గా పని చేస్తారని ఆశిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ స్పోక్స్ పర్సన్ అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు.

For More News..

ట్రంప్ కు ఆ పవర్ లేదు

అమెరికా జీపీఎస్‌‌‌‌‌‌‌‌కు డ్రాగన్ కంట్రీ సవాల్

సమస్యను కేటీఆర్ కు ట్వీట్ చేస్తే కేసులా!