భూమిపై, నీటిలో దాడి చేసే సరికొత్త నౌక
భూమిపైన, నీటిలో దాడి చేసే సరికొత్త ‘075 క్లాస్’ నౌకను చైనా లాంచ్ చేసింది. షాంఘైలోని ఓ షిప్‌యార్డ్ నుంచి దాన్ని ప్రపంచానికి చూపించింది. ఆ నౌక సైజు, దాని సామర్థ్యం గురించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. షిప్‌కు సంబంధించి ఇంకొన్ని పనులున్నాయని, అవి పూర్తయ్యాక తమకు అందుతుందని ఆ దేశ మిలిటరీ చెప్పింది. ఐదు నెలల క్రితం షిప్ నిర్మాణం జరుగుతున్నప్పటి ఫొటోలు బయటకొచ్చాయి. ఇంత తక్కువ టైంలోనే నౌక అందుబాటులోకి రావడం ఆశ్చర్యం. ఇలాంటి షిప్పులు డజన్ల కొద్దీ విమానాలు, హెలికాప్టర్లు, వందల సంఖ్యలో బలగాలను, వాళ్ల వస్తువులను తీసుకెళ్లగలవు. పసిఫిక్ మహాసముద్రంలో ఇప్పటికే అమెరికా, జపాన్ ఈ రకం షిప్పులతో గస్తీ కాస్తున్నాయి. పసిఫిక్ తీరం లో18 నెలలు గస్తీ కాసిన అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్ వాస్ప్.. ఈ మధ్యే తిరిగి ఆ దేశానికి వెళ్లింది. దాని స్థానంలో మరింత పెద్ద షిప్‌ను పంపిస్తామని అమెరికా ఇప్పటికే చెప్పింది. జపాన్ దగ్గర రెండు ఇజుమో క్లాస్ హెలికాప్టర్ డిస్ట్రాయర్లున్నాయి.
