
సూపర్ టైఫూన్ రాగసా తుఫాన్ చైనాను వణికిస్తోంది.ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఉష్ణమండల తుఫాను సూపర్ టైఫూన్ రాగసా బుధవారం (సెప్టెంబర్24) సాయంత్రం చైనా తీరాన్ని తాకింది. గంటకు 241 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తుండటంతో రెడ్ అలర్ట్ చేసింది అక్కడి వాతావరణ శాఖ.దక్షిణ చైనా ప్రాంతం నుంచి దాదాపు 20 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు తుఫాను కారణంగా తైవాన్, పిలిఫ్పైన్స్ లలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గల్లంతయ్యారు.
దక్షిణ గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో గంటకు 241 కి.మీ వేగంతో ఈదురు గాలులు, భారీ ఎత్తున్న సముద్రపు అలలు ఎగిసిపడుతుండటంతో అప్రమత్తమైన అధికారులు 1.9 మిలియన్ల మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సూపర్ టైఫూన్ రాగసా తుఫాను యాంగ్జియాంగ్, ఝాంజియాంగ్ మధ్య తీరాన్ని దాటింది. దీంతో ప్రభావితం అయ్యే 10 నగరాలల్లో ఇప్పటికే పాఠశాలలు, వ్యాపార దుకాణాలు మూసివేశారు. మరోవైపు హాంకాంగ్, జుహై నగర తీర ప్రాంతాల్లో భారీ అలలు ఎగిపడుతుండటంతో రెడ్ అలెర్ట్ జారీ చేసింది అక్కడి వాతావరణ శాఖ.
హాంకాంగ్ అబ్జర్వేటరీ ప్రకారం..రాగసా కేంద్రానికి సమీపంలో గరిష్టంగా గంటకు 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పశ్చిమ-వాయువ్య దిశగా తుఫాను కదులుతూ ఉందని అంచనా వేసింది. హాంకాంగ్ , దాని సమీపంలోని మకావులో పాఠశాలలు మూసివేశారు. విమానాలను రద్దు చేశారు. రెండు నగరాల్లోని పునరావాస కేంద్రాలలో వేలాది మంది ఆశ్రయం కల్పించారు.
మరోవైపు మంగళవారం తైవాన్‌లో కుండపోత వర్షం కురిసింది. తూర్పు తైవాన్‌లోని హువాలియన్ కౌంటీలోని గ్వాంగ్‌ఫు టౌన్‌షిప్‌లో ఓ బారియర్ సరస్సు పొంగిపొర్లింది. దీంతో ఓ వంతెన కూలిపోయి ఆ ప్రాంతంలోని రోడ్లు వరదల్లో మునిగిపోయాయి.తాజా సమాచారం ప్రకారం..టౌన్‌షిప్‌లో 15 మంది మరణించారు. కనీసం 17 మందితో గల్లంతయ్యారని స్థానిక అధికారులు తెలిపారు.
ఫిలిప్పీన్స్‌లో కూడా సూపర్ టైఫూన్ రాగసా తుఫాను బీభత్సం సృష్టించింది. 10 మంది చనిపోయనట్లు అధికారులు ప్రకటించారు. సోమవారం ఉత్తర కాగయన్ ప్రావిన్స్‌లోని శాంటా అనా పట్టణంలో భారీ అలల కారణంగా పడవ బోల్తా పడి ఏడుగురు మత్స్య కారులు చనిపోయారు. మరో ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని ప్రాంతీయ అధికారులు తెలిపారు.
►ALSO READ | H1B వీసా లేకపోతే సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ తయారయ్యే వాళ్లా : అమెరికా టెక్ కంపెనీ టాప్ వాళ్లంతా ఈ వీసాపై వచ్చినోళ్లే
బుధవారం తెల్లవారుజామున హాంకాంగ్ లో తుఫాను కారణంగా తీవ్రమైన గాలులు ,భారీ వర్షాలతో దక్షిణ చైనా తీరంలో జనజీవనాన్ని స్తంభించిపోయింది. దక్షిణ చైనాలోని 10 కి పైగా నగరాల్లో స్కూళ్లు, ఫ్యాక్టరీలు మూసివేశారు. రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
తైవాన్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన హువాలియన్ తూర్పు కౌంటీలో ఇప్పటివరకు 17మంది మృతిచెందారు. సూపర్ టైఫూన్ రాగసా కారణంగా పర్వతాలలోని ఓ బారియర్ సరస్సు పొంగిపొర్లడంతొ ఏకంగా పట్టణం మునిగిపోయింది. 124 మంది గల్లంతయ్యారని బుధవారం చైనా ఫైర్ డిపార్టుమెంట్ ప్రకటించింది. తైవాన్ అంతటా రెస్క్యూ బృందాలు, సైనిక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.