నెలలోనే చైనా ఎయిర్ బేస్ నిర్మాణం

నెలలోనే చైనా ఎయిర్ బేస్ నిర్మాణం

లడక్ దగ్గర్లో , పాంగాంగ్ నదికి 200 కిలోమీటర్ల దూరంలో చైనా ఎయిర్​ బేస్ ను నిర్మించింది. రన్ వే ఏర్పాటు చేసి ఫైటర్ జెట్లను నిలిపి ఉంచింది. ఇందుకు సంబంధిం చిన శాటిలైట్ ఇమేజ్ లు బయటికి వచ్చాయి. ఏప్రిల్ 6 వ తేదీ తీసిన చిత్రాలతో పోల్చి చూస్తే..ఈ నెల 21 నాటికి అక్కడ పరిస్థితి పూర్తిగా మారినట్లు కనిపిస్తోంది. భారీ నిర్మాణ పనులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ శాటిలైట్ చిత్రాలను ఇంటెలిజెన్స్ ఎక్స్​పర్ట్ ‘డెట్రెస్ఫా’ అనే సంస్థ విడుదల చేసింది.నాలుగు ఫైటర్ ప్లేన్లు హెలికాప్టర్లు , కాంబాట్ ఎయిర్​క్రాఫ్టులను నిలిపి ఉంచేందుకు తారు రోడ్డును అక్కడ నిర్మించారు. మరో శాటిలైట్ పిక్చర్​లో నాలుగు ఫైటర్ ప్లేన్లు వరుసగా పార్క్ చేసి ఉంచడం కనిపించింది. అవి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీఎయిర్​ఫోర్స్​కి చెందిన జే11 లేదా జే16 ఫైటర్లుగా భావిస్తున్నారు. మరోవైపు వేలాది మందిచైనా సోల్జర్లు లడఖ్ లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) దాటి వచ్చి ఉంటారని లేదా సరిహద్దుల దగ్గరగా వచ్చి ఉంటారని పలు రిపోర్టులు చెబుతున్నాయి.