ర్యాపిడ్ ​టెస్ట్ ​కిట్లపై చైనీస్ కంపెనీల క్లారిటీ

ర్యాపిడ్ ​టెస్ట్ ​కిట్లపై చైనీస్ కంపెనీల క్లారిటీ

గైడ్ లైన్స్ ప్రకారమే తయారు చేశాం

కరోనా ర్యాపిడ్ టెస్ట్ కోసం ఇండియాకు పంపించిన అయిదు లక్షల కిట్ల విషయంలో ఆ దేశంతో మాట్లాడతామని చైనా కంపెనీలు తెలిపాయి. ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు సరిగ్గా లేవని ఆరోపణలొచ్చిన నేపథ్యంలో చైనా కంపెనీలు స్పందించాయి. తాము గైడ్ లైన్స్ ప్రకారమే వాటిని తయారుచేసి, స్టోర్ చేశామని చెప్పాయి. అయితే చాలా నాసిరకంగా ఉన్నాయనే ఆరోపణలపై తాము దర్యాప్తుకు సిద్ధమేనని, ఇండియాకి సహకరిస్తామని ముందుకొచ్చాయి.

గువాంగ్జో వాండ్ఫో బయోటెక్, లివ్జాన్ డయాగ్నస్టిక్స్ అనే కంపెనీలు వాటిని ఇండియాకి సప్లయి చేశాయి. తమ ప్రొడక్ట్లపై ఆరోపణలు రావడంతో వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. గువాంగ్జో 3 లక్షల కిట్లు, లివ్జాన్ 2.5 లక్షల కిట్లు పంపించాయి. చైనా నుంచి వచ్చిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లు సరైన రిజల్ట్స్ చూపించడం లేదని తేలడంతో వాటిని ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్) వాడకుండా ఆపేసింది.

For More News..

సౌదీలో ఆ శిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు

కర్నాటకలో ప్లాస్మా థెరపీ షురూ