రష్యా నుంచి ప్రయాణాలను చైనా గ్రీన్ సిగ్నల్ …న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ మస్ట్

రష్యా నుంచి ప్రయాణాలను  చైనా గ్రీన్ సిగ్నల్ …న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ మస్ట్

బీజింగ్ : కరోనా వైరస్ కు కేంద్రమైన చైనా లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక్కడ కరోనా కేసులు భారీగా తగ్గటంతో ఇప్పటికే లాక్ డౌన్ ఎత్తివేసింది. దేశీయంగా విమాన ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైనా తాజాగా రష్యా నుంచి ప్రయాణాలకు అనుమతి ఇచ్చింది. ఐతే కండిషన్స్ అప్లయ్ చేస్తామని తెలిపింది. రష్యా నుంచి మాత్రమే ప్రస్తుతానికి ప్రయాణాలకు ఓకే చెప్పింది. చైనా ఎయిర్ లైన్స్ లో ప్రయాణించే వారంతా తప్పనిసరిగా న్లూక్లిక్ యాసిడ్ టెస్ట్ (ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ) చేయించుకోవాలని నిబంధన పెట్టింది. ఈ టెస్ట్ ల్లో నెగిటివ్ వచ్చిన వారికే ప్రయాణాలకు అనుమతిస్తామని తెలిపింది. మే 8 నుంచి బీజింగ్ టూ మాస్కో విమానాలు నడుస్తాయని చైనా తెలిపింది. ఐతే ప్రయాణానికి 5 రోజుల ముందే టెస్ట్ లు ఇవ్వాల్సిన ఉంటుంది. చైనాలోనూ ఒక సిటి నుంచి మరో సిటికి వెళ్లే వారు కూడా (ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ) టెస్ట్ లు చేయించుకోవాలని కోరింది. కాగా రష్యా లోనూ కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దాదాపు లక్ష 20 వేల కు పైగా కరోనా కేసులు ఇక్కడ నమోదయ్యాయి.