
హానర్ ఫోన్లు మళ్లీ మనదేశంలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ కంపెనీ హానర్ 90 5జీ స్మార్ట్ఫోన్ను గురువారం లాంచ్చేసింది. ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 జెన్ 1 చిప్, 66 వాట్ల సూపర్ ఛార్జర్, 6.7 అంగుళాల డిస్‌ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 200-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సర్, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సర్ ఉంటాయి.
8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ. 27,999 కాగా, 12జీబీ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ రేటు రూ. 29,999. ఈ ఫోన్ సెప్టెంబర్ 18 నుంచి దేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.