డిసెంబర్ లోనే కరోనా గురించి చైనాకు తెలుసు

డిసెంబర్ లోనే కరోనా గురించి చైనాకు తెలుసు
  • ప్రపంచాన్ని అలర్ట్ చేయటంలో చైనా, డబ్ల్యూహెచ్ఓ విఫలం
  • మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా

వాషింగ్టన్ : కరోనా కారణంగా అత్యంత ఎఫెక్ట్ కు గురవుతున్నది అమెరికా. అక్కడ కేసులు, మరణాలు పెద్ద సంఖ్యలో ఉంటున్నాయి. దీనంతటికీ కారణం చైనాయేనని అమెరికా వీలు దొరికనప్పుడల్లా డ్రాగన్ కంట్రీపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కరోనాను చైనీస్ వైరస్ అనే పిలుస్తున్నారు. తాజాగా అమెరికా ఫారెన్ మినిస్టర్ మైక్ పాంపియో సైతం మూల్యం చెల్లించక తప్పదని చైనాను హెచ్చరించారు. డిసెంబర్ లోనే కరోనా వైరస్ గురించి చైనాకు సమాచారం ఉన్నప్పటికీ ప్రపంచాన్ని అలర్ట్ చేయలేదని విమర్శించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కరోనా వ్యాప్తిని అరికట్టటంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహారించదన్నారు. అమెరికాలో ఉన్న న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో మైక్ పలు విషయాలపై మాట్లాడారు. వుహాన్ నుంచే వైరస్ పుట్టిందన్నది ప్రపంచ దేశాలకు తెలిసేలా చేస్తామని అన్నారు. ” అమెరికాలో కరోనా మరణాలు, ఆర్థిక సంక్షోభానికి కారణమైన వారు తప్పక మూల్యం చెల్లిస్తారు. వారు పారదర్శకంగా జవాబుదారీగా ఉండాలి ” అని పాంపియో అన్నారు.
మళ్లీ ఇలా జరగకుండా స్పెషల్ సిస్టమ్
చైనా నిర్లక్ష్యం కారణంగా ప్రపంచం బాధపడుతుందన్న అమెరికా ఇక భవిష్యత్ ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని తెలిపింది. ఇందుకు కోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. చైనా సహా ఇతర దేశాల్లో వైరస్ పుట్టుకొస్తే అది వ్యాప్తి చెందకుండా ఉండేలా స్పెషల్ సిస్టమ్ ను పనిచేస్తుందని మైక్ పాంపియో చెప్పారు. కరోనా సంక్షోభాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు మళ్లీ పుంజుకునేందుకు అమెరికా ఆయా దేశాలకు సహాయ పడుతుందన్నారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులు నిషేధాన్ని సరైన సమయంలో తొలగిస్తామన్నారు. మళ్లీ ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం ఊపందుకుంటుందని పాంపియో ధీమా వ్యక్తం చేశారు.