కరోనా భయం: చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌

కరోనా భయం: చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌

బీజింగ్‌: కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. దీంతో వైరస్ వ్యాప్తిని నివారించానికి డ్రాగన్ కంట్రీలో పలు చోట్ల మళ్లీ లాక్‌డౌన్ విధించారు. తాజాగా బీజింగ్‌లో నమోదైన 75 కేసులకు సంబంధించిన లింక్స్‌ ఫుడ్‌ మార్కెట్‌లో ఉండటంతో అక్కడి పరిసరాలను అధికారులు లాక్ డౌన్ చేశారు. అలాగే ఆ ప్రాంతంలో ట్రేసింగ్‌తోపాటు టెస్టింగ్స్‌ చేపట్టారు. చైనా వ్యాప్తంగా సోమవారం 49 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని హెల్త్ అఫీషియల్స్‌ తెలిపారు. వీటిలో 36 కేసులు బీజింగ్‌ క్లస్టర్‌‌లోని గ్జిన్‌ఫడి మార్కెట్‌తో లింక్ ఉన్నవిగా అనుమానిస్తున్నారు. దీంతో ఇన్ఫెక్షన్స్‌ వేవ్ మరోసారి వస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు.

నార్త్‌వెస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌లోని యూక్వాన్‌డాంగ్‌లోని హోల్‌సేల్ మార్కెట్‌లో కూడా పలు కొత్త కేసులు నమోదైనట్లు సిటీ అఫీషియల్ లీ జున్‌లీ ప్రెస్ కాన్ఫరెన్స్‌తో చెప్పారు. దీంతో సదరు మార్కెట్‌తో పాటు దగ్గర్లోని స్కూళ్లను అధికారులు మూసేశారు. ఆ ఏరియాలో ఉన్న ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని అఫీషియల్స్ ఆదేశించారు. లాక్‌డౌన్ కింద ఎన్ని ఇళ్లు ఉన్నాయనేది ప్రస్తుతానికి తెలియరాలేదు. కానీ దీని వల్ల వేలాది మంది ప్రజలు మళ్లీ లాక్‌డౌన్‌లో ఉండాల్సి వస్తుందని సమాచారం.