బార్డర్‌‌లో ఉద్రిక్తతలకు చెక్ పెడ్దాం.. చైనా ప్రతిపాదన

బార్డర్‌‌లో ఉద్రిక్తతలకు చెక్ పెడ్దాం.. చైనా ప్రతిపాదన

లడఖ్: ఇండో-చైనా సరిహద్దు వద్ద ఏడు నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్రిక్తతలను తొలగించుకునే క్రమంలో ఇరు దేశాల సైనికాధికారులు ఇప్పటి వరకు 8 దఫాలుగా చర్చలు జరిపారు. వారం కింద కోర్‌ కమాండర్ల స్థాయిలో జరిగిన చర్చల్లో బార్డర్‌‌లో శాంతిని నెలకొల్పే దిశగా కీలక ముందడుగు పడినట్లు సమాచారం. ఫింగర్-8 ప్రాంతానికి తన దళాలను వెనక్కి తీసుకోవడంతోపాటు ఇరు దేశ సైన్యాలు తమ అసలైన స్థానాలకు వెళ్లేందుకు చైనా ప్రతిపాదించిందని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలో యుద్ధ ట్యాంకులను వెనక్కి తీసుకెళ్లడం కూడా ఉంది. అయితే ఈ ప్రతిపాదనకు సంబంధించి ఎలాంటి ఒప్పందం జరగకపోవడం గమనార్హం. చైనా ఆఫర్‌‌ను ఇండియా పరిశీలిస్తోందని.. మిగిలిన ఘర్షణ ప్రాంతాల నుంచి సైన్యాలు వెనక్కి తగ్గడంపైనా చర్చలు జరుగుతున్నాయని సమాచారం.