
ఆసియా కప్ కు టీమిండియా స్క్వాడ్ ను మంగళవారం (ఆగస్టు 19) ప్రకటించారు. 15 మందిలో కొంతమంది స్టార్ క్రికెటర్లకు ఎప్పటిలాగే చోటు దక్కపోవడం నిరాశకు గురి చేస్తోంది. ఈ లిస్ట్ లో శ్రేయాస్ అయ్యర్, ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తో పాటుగా సీనియర్లు కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, రిషబ్ పంత్ లకు చోటు దక్కలేదు. ఈ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఆసియా కప్ టీమిండియా ప్లేయింగ్ 11 పై ప్రతి ఒక్కరి దృష్టి నిలిచింది. 15 మంది జట్టులో తుది జట్టులో ఎవరికి స్థానం లభిస్తుందో చెప్పడం కష్టం. అయితే ఓపెనర్లు ఎవరనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది.
ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగబోతుంది. ఈ కాంటినెంటల్ టోర్నీలో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఈ మెగా టోర్నీకి అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైంది. అభిషేక్ శర్మ ఓపెనింగ్ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. అతను బౌలింగ్ కూడా చేయగలడు కాబట్టి తుది జట్టులో ఖచ్చితంగా ఉంటాడు. అయితే ఇప్పుడు అభిషేక్ తో ఎవరు ఓపెనర్ గా బరిలోకి దిగుతారో చర్చ జరుగుతుంది. గిల్ లేనప్పుడు అభిషేక్, శాంసన్ ఓపెనర్లుగా ఆడి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు గిల్ రావడంతో కొత్త తలనొప్పి మొదలయింది.
►ALSO READ | Shubman Gill: బీసీసీఐ క్లియర్ మెసేజ్.. మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా గిల్.. ఎప్పటి నుంచి అంటే..?
వైస్ కెప్టెన్ గా గిల్ ఎలాగో ప్లేయింగ్ 11 లో ఉంటాడు. వస్తున్న సమాచార ప్రకారం ఆసియా కప్ కు అభిషేక్ శర్మతో శుభమాన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరూ కూడా స్పెషలిస్ట్ ఓపెనర్లే ఇందుకు కారణం. అదే జరిగితే సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ కు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓపెనర్ గా మూడు సెంచరీలు చేసిన సంజుకు ఒక రకంగా ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మిడిల్ ఆర్డర్ లో అయినా శాంసన్ కు ఆడిస్తారా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మొత్తానికి ఓపెనర్ స్థానం ఖాయమనుకుంటే ఇప్పుడు కనీసం తుది జట్టులో కూడా శాంసన్ కు చోటు అనుమానంగా మారింది.
అభిషేక్ శర్మ, గిల్ ఇద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కావడం విశేషం. వీరిద్దరూ పంజాబ్ కు చెందినవారు. ఈ జోడీ కలిసి డొమెస్టిక్ క్రికెట్ లో
పంజాబ్ తరపున ఎన్నో మ్యాచ్ లు ఆడారు. 2024లో జింబాబ్వే టీ20 పర్యటనలో ఈ ద్వయం టీమిండియా ఇన్నింగ్స్ ను ఆరంభించారు. వీరిద్దరూ కలిస్తే ఆసియా కప్ లో దుమ్ములేపడం ఖాయంగా కనిపిస్తుంది.