
బీజింగ్: కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం ఇండియాతోపాటు బ్రిక్స్ దేశాలతో కలసి పని చేయడానికి సిద్ధమని చైనా తెలిపింది. ఈ ప్రయత్నంలో భాగంగా డబ్ల్యూహెచ్‌వో నాయకత్వానికి మద్దతు ఇవ్వడానికి తాము రెడీగా ఉన్నామని చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ చెప్పారు. ‘వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగంగా రష్యా, బ్రెజిల్‌కు చెందిన పలు భాగస్వామ్య సంస్థలతో చైనా కంపెనీలు పని చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. మేం సౌతాఫ్రికాతోపాటు ఇండియాతో కలసి ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. మేం కోవ్యాక్స్ ఫెసిలిటీలోనూ జాయిన్ అయ్యాం. తద్వారా ఇతర దేశాలతో మా వ్యాక్సిన్‌ను పంచుకునేందుకు అవకాశం ఏర్పడింది’ అని జిన్‌పింగ్ పేర్కొన్నారు.