
బీజింగ్ : కరోనా నివారణకు చైనా కంపెనీలు తయారు చేసిన మూడో వ్యాక్సిన్ సెకండ్ స్టేజ్ కు చేరింది. ఈ వ్యాక్సిన్ ను రెండోదశ ప్రయోగానికి చైనా అనుమతించింది. ఈ వ్యాక్సిన్ ను చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ (సినోఫార్మ్), వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) నేతృత్వంలో వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ ప్రొడక్ట్స్ డెవలప్ చేసింది. వైరస్ కణాలు, బ్యాక్టీరియా, ప్యాథోజెన్స్ వ్యాక్సిన్ లో ఉంటాయి. ఏప్రిల్ 23 న తొలిదశలో 96 మందిపై క్లినికల్ ట్రయల్స్ చేశారు. ఇందులో మంచి రిజల్స్ట్ వచ్చాయని సినోఫార్మ్ సంస్థ తెలిపింది. క్లినికల్ ట్రయల్ పూర్తై…వ్యాక్సిన్ ఎంత వరకు సేఫ్ అనేది చెప్పేందుకు కనీసం ఏడాది సమయం పట్టవచ్చని అంచనా. ఐతే సెప్టెంబర్ నాటికే వ్యాక్సిన్ ను తీసుకొచ్చేందుకు మరో ప్రయత్నం చేస్తున్నామని చైనా తెలిపింది. సెప్టెంబర్ నాటికే కరోనా నివారణకు వ్యాక్సిన్ ను తెస్తామని అది డాక్టర్లకు మాత్రమే ఇస్తామని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నాటికి అందరికీ అందుబాటులోకి తెస్తామని తెలిపింది. కరోనా నివారణకు ప్రపంచ వ్యాప్తంగా వందలాది సంస్థలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. మనదేశంలోనే 70 కంపెనీలు వ్యాక్సిన్ రూపొందించేందుకు కృషి చేస్తున్నాయి.