అఫ్గాన్ ప్రభుత్వం విషయంలో జోక్యం చేసుకోం 

అఫ్గాన్ ప్రభుత్వం విషయంలో జోక్యం చేసుకోం 

కాబూల్: అఫ్గానిస్థాన్‌లో కొలువుదీరిన తాలిబన్ల ప్రభుత్వానికి చైనా మద్దతు తెలిపింది. అయితే ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని డ్రాగన్ కంట్రీ స్పష్టం చేసింది. అఫ్గాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను తాము గౌరవిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఆమిర్ ఖాన్‌ ముత్తఖీతో జరిగిన మీటింగ్‌లో చైనా అంబాసిడర్ వాంగ్ యూ చెప్పారు. అఫ్గాన్‌లో విస్తృ‌తమైన, అందర్నీ కలుపుకుపోయే రాజకీయ నిర్మాణం ఏర్పాటు అవుతుందని ఆశిస్తున్నామని వాంగ్ పేర్కొన్నారు. తమ దేశ పరిస్థితులకు తగ్గట్లుగా అభివృద్ధి మార్గాన్ని ఎంచుకునే అధికారం అఫ్గాన్ ప్రజలకు ఉందన్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. కరోనా సాయంలో భాగంగా అఫ్గాన్‌కు 3 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించిన రోజే.. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని  చైనా ప్రకటించడం గమనార్హం.