నర్సు సమయస్పూర్తితో రోగికి ఆపరేషన్

నర్సు సమయస్పూర్తితో రోగికి ఆపరేషన్

 చైనా లో ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. ఇంగ్లీష్ మాత్రమే తెలిసిన ఒకతను అనారోగ్యంతో… చైనా లోని హాస్పిటల్ లో చేరాడు. పరీక్షించిన డాక్టర్లు అతనికి మరుసటి రోజు ఆపరేషన్ చేయాలని ఈ విషయాన్ని రోగికి చెప్పమని.. నైట్ డ్యాటీలో ఉన్న మేల్ నర్స్ కు చెప్పి వెళ్లారు. తీరా చూస్తే.. ఆ రోగికి చైనా భాష రాదు.. ఈ నర్స్ కు ఇంగ్లీష్ రాదు. కానీ విషయం మాత్రం తెలియచేయాలి. తెలవారితే ఆపరేషన్ కాబట్టి డాక్టర్లు ఫుడ్ తీసుకునే విషయంలో కొన్ని నియమాలను చెప్పి వెళ్లారు. అవి రాత్రికి పాటిస్తేనే ఉదయం ఆపరేషన్ చేయగలరు.

ఏంచేయాలో తోచని ఆ మేల్ నర్స్ కు అనుకోకుండా ఓ ఆలోచన తట్టింది. డాక్టర్ చెప్పిన నియమాలను..  పేపర్ పై  బొమ్మల రూపంలో గీసి చూపించాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటో అదే…

ఉదయం ఆపరేషన్ ఉందని రాత్రి పది గంటల తర్వాత ఆహారం తీసుకోవద్దని, నీళ్లు కూడా తాగవద్దని ఒక బొమ్మగీసి చూపించాడు నర్స్. రేపు ఉదయం 8 గంటలకు ఆపరేషన్ చేయాలని ఓ కత్తి బొమ్మ గీసి దానికి కొంచెం రక్తపు రంగును పులిమి చూపించాడు.దీంతో ఆ బొమ్మలను అర్థం చేసుకున్న రోగి నర్స్ చెప్పినట్టే పాటించాడు. ఈ ఫొటోలు ఇంటర్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. నర్స్ క్రియేటివిటీని అభినందిస్తున్నారు.