బైక్ పై వెంబడించి పుస్తెలతాడు లాక్కెళ్లాడు

బైక్ పై  వెంబడించి  పుస్తెలతాడు లాక్కెళ్లాడు

హైదరాబాద్: బాట సింగారం హైవేపై చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు.  బైక్ పై వెళ్తున్న కమల, నర్సింహారెడ్డి దంపతులను వెంబడించి.. కమల మెడలో నుంచి 4 తులాల పుస్తెలతాడు లాక్కెళ్లాడు. స్నాచింగ్ చేసే టైంలో మెడలో నుంచి పుస్తెల తాడును లాగటంతో.. బైక్ పై నుంచి కిందపడిపోయారు. కిందపడిపోయిన పుస్తెలతాడును వెనక్కి వచ్చి తీసుకెళ్లాడు స్నాచర్. బాధితులకు తీవ్ర గాయాలవడంతో.. కొత్తపేట్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల క్రితం  ఈ స్నాచింగ్ ఘటన జరిగింది. అయితే తమకు న్యాయం చేయాలని కమల దంపతులు వేడుకున్నారు. స్నాచింగ్ లో బంగారంతో పాటు... సామాన్య ప్రజల ప్రాణాలు పోతున్నాయంటున్నారు. స్నాచర్ ను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.