చిన జీయర్స్వామి క్షమాపణ చెప్పాలె

చిన జీయర్స్వామి క్షమాపణ చెప్పాలె

మేడారం: సమ్మక్క సారక్క దేవతలను కించపరిచే విధంగా మాట్లాడిన చిన జీయర్స్వామి బేషరత్గా క్షమాపణ చెప్పాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. సమ్మక్క సారక్కలు ఏమైనా బ్రహ్మలోకం నుంచి దిగొచ్చారా? వాళ్లు దేవుళ్లు ఏంటీ? అంటూ చిన జీయర్స్వామి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. చిన జీయర్స్వామి వ్యాఖ్యలను ఖండిస్తూ పలు ఆదివాసి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా ఆదివాసులు  సమ్మక్క సారక్కలను తమ ఇష్ట దైవాలుగా పూజిస్తున్నారన్నారు. మేడారం జాతర ఆసియాలోనే రెండో అతిపెద్ద పండగన్నారు. కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా దేశ నలుమూలల కోటిమందికి పైగా భక్తులు మేడారం వచ్చి గిరిజన దేవతలను దర్శించుకుంటారన్నారు. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న మేడారం గురించి చిన జీయర్స్వామి సంకుచితంగా మాట్లాడారన్నారు.సమతామూర్తిని దర్శించుకున్న పీఎం మోడీ, సీఎం కేసీఆర్.. సమ్మక్క సారక్కల దర్శనం ఎందుకు చేసుకోలేదని ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే గిరిజనుల దేవుళ్లపై దాడులు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

ఆపరేషన్ గంగా ఇంకా పూర్తి కాలేదు

రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలి