
హైదరాబాద్, వెలుగు : తుంటి ఎముక విరగడంతో సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ను శనివారం రాత్రి చిన్నజీయర్ స్వామి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. డాక్టర్లతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దాదాపుగా రెండేళ్లుగా చిన్న జీయర్ కు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. తాజాగా కేసీఆర్ ఫామ్ హౌస్లో కిందపడి హాస్పిటల్లో చేరడంతో జీయర్ స్వయంగా హాస్పిటల్కు వచ్చి పరామర్శించారు.