గుజరాత్​లో మైక్రాన్​ చిప్​ ప్లాంట్​

గుజరాత్​లో మైక్రాన్​ చిప్​ ప్లాంట్​

న్యూఢిల్లీ: చిప్​ తయారీ కంపెనీ మైక్రాన్​ సెమికండక్టర్​ అసెంబ్లీ అండ్​ టెస్ట్ ​ప్లాంట్​ను గుజరాత్​లో ఏర్పాటు చేయనుంది. ప్లాంట్​ ఏర్పాటుకు రూ. 22,540 కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ పెట్టుబడిలో రూ. 6,760 కోట్లను తాము​ పెడుతుండగా, మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం రెండు దశలలో సమకూరుస్తుందని మైక్రాన్​  తెలిపింది.  లోకల్​ సెమికండక్టర్​ ఎకో సిస్టమ్​ ఏర్పాటుకు ఇండియా తీసుకుంటున్న చొరవ మంచి పరిణామమని మైక్రాన్​ సీఈఓ సంజయ్​ మెహ్రోత్రా చెప్పారు.

మాడిఫైడ్​ అసెంబ్లీ, టెస్టింగ్​, మార్కింగ్​అండ్​ ప్యాకేజింగ్​ (ఏటీఎంపీ) స్కీము కింద ప్రభుత్వం ఈ మైక్రాన్​ ప్లాంట్​కు అనుమతి ఇచ్చింది.  స్కీము కింద ప్రాజెక్టు ఖర్చులో  50 శాతాన్ని ఫిస్కల్​ సపోర్టుగా కేంద్ర  ప్రభుత్వం నుంచి మైక్రాన్​ పొందుతుంది. ఇది కాకుండా మరో 20 శాతాన్ని ఇన్సెంటివ్స్​ రూపంలో గుజరాత్​ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. 2023 లోనే ప్లాంట్​నిర్మాణం మొదలవనుంది. మొదట 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాంట్​ ఏర్పాటు చేస్తారు. ఇది 2024 చివరలోపు ఆపరేషన్స్​ ప్రారంభించనుంది.