తమ్ముడి పాటకు మెగాస్టార్ మాస్ స్టెప్స్.. పక్కన రష్మీ కూడా!

తమ్ముడి పాటకు మెగాస్టార్ మాస్ స్టెప్స్.. పక్కన రష్మీ కూడా!

ఇప్పటివరకు మనం చాలా సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) రిఫరెన్సెస్ చూసే ఉంటాం. ఆయా సినిమాల్లో చిరంజీవి అంటే పడిచచ్చే అభిమానులుగా చాలా మంది హీరోలు కనిపించారు. ఇక చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్(Pawan kalyan) కూడా తన సినిమాల్లో చిరు రిఫరెన్సెస్ వాడారు. ఇక తాజాగా మొదటి సారి మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేశారు. 

ALSO READ :జులై 17, 18న బెంగళూరులో విపక్షాల సమావేశాలు…

ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్(Bhola shankar). మెహెర్ రమేష్(Meher shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చిరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపించనున్నారట. ఇందులో భాగంగానే ఈ సినిమా నుండి తాజాగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ చిరు. అదేంటంటే.. ఈ సినిమాలో చిరు పవన్ కళ్యాణ్ ఖుషీ(Khushi) సినిమాలోని "ఏ మేరా జహా" పాటకు స్టెప్స్ వేస్తూ కనిపించారు. దీనికి సంబందించిన వీడియో కూడా రిలీజ్ చేశారు చిరు. ఇంకా ఈ వీడియో లో పవన్ మ్యానరిజం కూడా ఇమిటేట్ చేశారు. ఆ తరువాత రష్మీతో.. తమ్ముడి పాట అదిరిపోయింది కదా అని అంటారు. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇక ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. తమ్ముడి పాటకు అన్నయ్య మాస్ ఇమిటేషన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సినిమాలో వచ్చే ఈ సీన్ కు ఆడియన్స్ ఎంజాయ్ చేయడం ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నారు. మరి చిన్న వీడియోతోనే ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. రిలీజ్ తరువాత ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుందో తెలియాలంటే ఆగస్టు 11 వరకు ఆగాల్సిందే.