అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : చిరంజీవి

అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు :  చిరంజీవి

తన తల్లి అంజనాదేవికి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సెష్పల్ ట్వీట్ చేశారు. "మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ  పుట్టిన రోజు.  జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ... హ్యాపీ బర్త్‌డే అమ్మ" అంటూ చిరు ట్వీట్ చేస్తూ పలు ఫొటోలను పంచుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తన తల్లి బర్త్ డేను జరిపారు. మెగా అభిమానులు కూడా అంజనాదేవికి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో  మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ కొట్టారు.  బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిరు సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. సంక్రాంతి కానుకగా రిలీజైన  వాల్తేరు వీరయ్య  భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతుంది.