అమెరికా అభిమానులతో ‘వాల్తేరు వీరయ్య’ హంగామా

అమెరికా అభిమానులతో ‘వాల్తేరు వీరయ్య’ హంగామా

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రం సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకుంది. విడుదలైన10 రోజుల్లోనే రూ.200 కోట్లకి పైగా వసూళ్లు చేసింది. వీరయ్య మాస్ జాతర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా చిరు ఎన్నారై అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాలకు చెందిన తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. చిరంజీవి లైవ్‌లో ఉండగానే అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మీ అభిమానం వల్లే  ఇంతటి విజయం సాధ్యమైందంటూ చిరు భావోద్వేగానికి లోనైయ్యారు.

వీరయ్య యూఎస్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. అక్కడ ఈ సినిమా రెండు రోజుల క్రితం 2 మిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. బాబీ తెరకెక్కించిన ఈ సినిమా మైత్రీ బ్యానర్లో నిర్మితమైంది. చిరంజీవికి జోడీగా శృతిహాసన్ నటించింది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ హైలేట్ అని చెప్పాలి. ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటించాడు.