
చాలామంది బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు హైదరాబాద్‌లో షూటింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పలు హిందీ చిత్రాల షూటింగ్స్ ఇక్కడ జరుగుతున్నాయి. అయితే చిరంజీవి మాత్రం తన మూవీ షూటింగ్ కోసం ముంబై వెళ్తున్నారు. అందుకు కారణం.. సల్మాన్. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీలో సల్మాన్ ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తన షెడ్యూల్ చాలా టైట్‌గా ఉంది. దాంతో చిరంజీవి, సల్మాన్ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌ను ముంబైలో ప్లాన్ చేశారు. ఈరోజు నుంచి ముంబైలోని ఓ స్టూడియోలో షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తోంది. దాదాపు వారం రోజుల పాటు ఈ షూట్ జరగనుంది. ఇందుకోసం ముంబై వెళ్లిన చిరంజీవి, సల్మాన్‌కు చెందిన పన్వేల్ ఫామ్ హౌస్‌లో ఉంటుంన్నట్టు తెలుస్తోంది. సల్మాన్‌కు ఈ ఫామ్ హౌస్ అంటే చాలా ఇష్టం. షూటింగ్స్ లేకపోతే అక్కడే ఎక్కువగా గడుపుతుంటాడు. ఇక జనవరిలోనే ఈ షెడ్యూల్‌కి ప్లాన్ చేసినప్పటికీ, చిరంజీవికి కొవిడ్ రావడం, ఆ తర్వాత సల్మాన్ ‘టైగర్ 3’ షూట్‌లో ఉండడంతో ఆలస్యమైంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా తీయబోతున్నట్టు తెలుస్తోంది. మలయాళ చిత్రం ‘లూసిఫర్’కి ఇది రీమేక్. నయనతార, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.