కమల్కు చిరు సన్మానం.. సల్మాన్ సందడి..

కమల్కు చిరు సన్మానం.. సల్మాన్ సందడి..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన చిరకాల మిత్రుడు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ను ఘనంగా సన్మానించాడు. కమల్ నటించిన విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. తన మూవీ సక్సెస్ మీట్ కోసం హైదరాబద కు వచ్చిన కమల్ ను చిరు తన ఇంటి ఆహ్వానించారు.  కమల్ కు మెగాస్టర్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించి సన్మానించారు. అలాగే 'విక్రమ్' మూవీ దర్శకుడు కనకరాజును కూడా చిరు అభినందించారు. ఈ సందర్భంగా విక్రమ్ మూవీపై ఆయన ప్రశంసలు కురిపించారు.

ఈ విషయాన్ని చిరు తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. తన మిత్రుడు కమల్ ను సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని చిరు తెలిపారు. కమల్,సల్మాన్ ఖాన్,డైరెక్టర్ కనకరాజు,'విక్రమ్' సినిమాకు చెందిన ఇతర టీమ్ సభ్యులకు శనివారం రాత్రి తన నివాసంలో వింధు ఏర్పాటు చేశానని చిరు చెప్పారు. మై డియర్ ఫ్రెండ్ 'విక్రమ్' ఒక అద్భుతమైన సినిమా అని ప్రశంసించారు. నీవు మరింత శక్తిమంతం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ సినిమా తనకు ఎంతో నచ్చిందని చిరు పేర్కొన్నారు. మరోవైపు 'కభీ ఈద్ కభీ దీవాలీ' సినిమా షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన కూడా చిరు ఇంట్లో సందడి చేశారు. ఈ మగ్గురు స్టార్స్ ఒకే చోట కలవడం ఫ్యాన్స్ కు కన్నుల పండుగ అని చెప్పాలి.