
ఓ వైపు టీజర్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నఅల్లు అర్జున్ పుష్ప మూవీ రోజుకో కొత్త అప్ డేట్ తో అభిమానుల్ని సర్ ప్రైజ్ చేస్తోంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో రెండు భాగాలుగా ఈ సినిమా రానుండటం ఓ విశేషమైతే. అంతకంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది.స్లార్ హీరోల సినిమాల్లో ఇతర హీరోలు గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం తెలిసిందే. అయితే ఈ సారి బన్ని సినిమాలో కనిపించబోయేది మాత్రం మెగాస్టార్ చిరంజీవి కావడం విశేషం. సుకుమార్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఎంత సూపర్ హిట్టవుతాయో ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా కోసం కూడా అలాంటి ఓ మాస్ సాంగ్ ను ఇప్పటికే రెడీ చేశాడంట దేవిశ్రీప్రసాద్. బన్ని కోరిక మేరకు ఈ పాటలో చిరంజీవి స్టెప్పులేయబోతున్నారట, అఫషియల్ అనౌన్స్ మెంట్ అయితే లేదు కానీ ఈ విషయం దాదాపు కన్ ఫర్మ్ అంటున్నారు. ఇది నిజమైతే మాత్రం అభిమానులకు పండగే. వచ్చే నెలలో ఈ మూవీ ఫస్ట్ పార్ట్ షెడ్యూల్ ను ప్రారంభించి బ్యాలెన్స్ షూటింగ్ ను కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. .ఆ తర్వాత వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ లో నటించనున్న బన్ని అది పూర్తయ్యాక పుష్ప సీక్వెల్ లో నటిస్తాడు. ఆ తర్వాత బోయపాటి శ్రీను,మురుగదాస్, కొరటాల శివలతో వరుసు సినిమాలు ఉంటాయి. మొత్తానికి బన్నీ లైనప్ ఓ రేంజ్ లో ఉంది.