చిరంజీవి ఆక్సీజ‌న్ బ్యాంక్ ప్రారంభం

V6 Velugu Posted on May 24, 2021

క‌ర్ణాట‌క‌: మెగాస్టార్ చిరంజీవి ఆక్సీజ‌న్ బ్యాంక్ సోమ‌వారం ప్రారంభ‌మైంది. క‌ర్ణాట‌క‌లోని చింతామ‌ణి ప్రాంతంలో ఈ ఆక్సీజ‌న్ ప్లాంట్ ను ఓపెన్ చేశారు. అఖిల భార‌త చిరంజీవి యూత్ ప్రెసిడెంట్ ఈ బ్యాంక్ ను ప్రారంభించ‌గా..మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా అత‌డికి అభినంద‌న‌లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు అభిమానుల మ‌ద్ద‌తు ఎక్కువ‌గా ఉన్న ఇత‌ర ప్రాంతాల్లోనూ..చిరంజీవి ఆక్సీజ‌న్ బ్యాంకుల‌ను నెల‌కొల్ప‌నున్నారు.

కరోనా బాధితులు ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో చిరంజీవి ఈ కార్యానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలోని ప్రతీ జిల్లాలోనూ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ట్విట్టర్ వేదికగా అఫీషియల్ స్టేట్‌మెంట్ ను విడుదల చేసింది.

Tagged launched, karnataka, corona, Chiranjeevi, , Oxygen Bank

Latest Videos

Subscribe Now

More News