తెలుగు సినిమా ఉన్నంత కాలం ప్రేక్షకుల మనసుల్లో ఏఎన్నార్ ఉంటారు: మెగాస్టార్ చిరంజీవి

తెలుగు సినిమా ఉన్నంత కాలం ప్రేక్షకుల మనసుల్లో ఏఎన్నార్ ఉంటారు: మెగాస్టార్ చిరంజీవి

తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి(Akkineni NageswaraRao centenary) ఉత్సవాలు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావును గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్టు చేశారు మెగాస్టార్ చిరంజీవి.

అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఆయనకు ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా బ్రతికినంత వరకు ఆయన తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులకు, నా సోదరుడు నాగార్జునకు.. కోట్లాది అభిమానులకు, సినీ ప్రేమికులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు” అని రాసుకోచ్చాడు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.