రవితేజ్ రావణాసుర కొత్త పోస్టర్ రిలీజ్

రవితేజ్ రావణాసుర కొత్త పోస్టర్ రిలీజ్

మాస్ రాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మూడు సినిమాలను లైన్లో ఉండగా  లేటెస్ట్ రావణాసుర అనే కొత్త సినిమాను ప్రారంభించాడు. మెగస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. సుధీర్ వర్మ డైరెక్షన్ లో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.  అంతేగాకుండా సినిమా ఫస్ట్ లుక్ ను మెగస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. వైట్ డ్రెస్ కోట్ తో సిగరెట్ వెలిగిస్తూ స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ఈ సినిమాలో హీరో సుశాంత్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్ లుగా మేఘాఆకాష్,ఫరియా అబ్దుల్లా, దక్ష నగర్కార్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఈ మూవీ 2022 సెప్టెంబర్ 30 న రిలీజ్ కానుంది.