వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారు.. త్రిషనే కాదు ఏ స్త్రీని కూడా అలా అనకూడదు : చిరంజీవి

వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారు..  త్రిషనే కాదు ఏ స్త్రీని కూడా అలా అనకూడదు : చిరంజీవి

తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల హీరోయిన్ త్రిషపై  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఇండస్ట్రీతో సంబంధం లేకుండా సీనీ ప్రముఖులంతా ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు.  త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక ఆర్టిస్ట్ కి మాత్రమే కాదు ఏ స్త్రీని కూడా అనకూడదు.  ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయికి వచ్చినా నేను అండగా, సపోర్ట్ గా నిలబడతాను అని ట్వీట్ చేశారు చిరు.  ఏకంగా మెగాస్టార్ చిరంజీవి త్రిష అంశంపై స్పందించడంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. 

ఇంతకీ ఏం జరిగింది అంటే ? 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ అలీఖాన్..  లియో సినిమాలో హీరోయిన్  త్రిషతో ఓ సీన్‌ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నో చిత్రాల్లో నేను రేప్‌ సీన్లలో నటించా. లియోలో ఆఫర్‌ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్‌ ఉంటుందని అనుకున్నా. కాకపోతే, అలాంటి సీన్‌ లేకపోవడం బాధగా అనిపించింది అని మన్సూర్‌ అలీఖాన్‌ అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

త్రిష రియాక్షన్  ఎంటీ ?  

అటు  మన్సూర్ అలీఖాన్ కామెంట్స్ పై హీరోయిన్ త్రిష కూడా రియాక్ట్ అయింది. మన్సూర్ అలీ ఖాన్ నా గురించి అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అలాంటి వ్యక్తితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనందుకు సంతోషంగా ఉంది. నా ఫిల్మ్‌కెరీర్‌లో ఇలాంటి వారితో నటించకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటా. ఇలాంటి వారి వల్లే మానవాళికి చెడ్డపేరు వస్తోంది అంటూ ట్వీట్ చేసింది.