చరణ్ నటనకి  కన్నీళ్లొచ్చాయి

చరణ్ నటనకి  కన్నీళ్లొచ్చాయి

చిరంజీవి హీరోగా రామ్​చరణ్ కీలక పాత్రలో కొరటాల శివ తెరకెక్కించిన ‘ఆచార్య’ విడుదల దగ్గర పడింది. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ ఫ్రైడే విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిరంజీవి మాట్లాడుతూ ‘నాది ప్రొఫెసర్ క్యారెక్టర్ కాదు. కానీ అంత జ్ఞానం ఉన్న వ్యక్తి. ఎంచుకున్న మార్గం నక్సలిజం. ధర్మానికి అండగా నిలబడే వ్యక్తి కనుక ‘ఆచార్య’ టైటిల్ జస్టిఫై అయినట్టే. ‘రక్తసింధూరం’లో కూడా నక్సలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటించాను. కానీ అందులో అగ్రెసివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండే క్యారెక్టర్. ఇందులో నాయకత్వ లక్షణాలు ఉండే పాత్ర. లోపల ఎంత ఆవేశం ఉన్నా పైకి చూపించడు. ఇక చరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది చాలా కీలకమైన పాత్ర. కథను, కథనాన్ని, నా పాత్రను, ప్రేక్షకుల్ని కూడా కదిలించే క్యారెక్టర్. ఈ పాత్ర చేయడం చరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వీలు పడకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ మరో బెస్ట్ ఆప్షన్ అయ్యుండేవాడు. నటన విషయంలో నేనెప్పుడూ చరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి సలహాలు ఇవ్వలేదు, ఇవ్వను. ఎందుకంటే నేను సలహాలిస్తే నాలా అవుతాడు. తనకు తానుగా ఇంప్రూవ్ అవడంలోనే ఒరిజినాలిటీ ఉంటుంది. ఈ సినిమాలోని ఓ సీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలిసి నటించేటప్పుడు, చరణ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూసి గ్లిజరిన్ లేకుండానే నాకు కన్నీళ్లు వచ్చేశాయి. తను మనసు పెట్టి నటించడం వల్లే అది సాధ్యమైంది. నేనెలాగూ పాతవాడినే. పాత, పాత కలిస్తే మోత తప్ప ఏమి ఉంటుంది! అందుకే ఈ తరం దర్శకులతో వర్క్ చేస్తున్నా (నవ్వుతూ). కొత్తవాళ్లయితేనే నన్ను నటుడిగా కొత్తగా ఆవిష్కరిస్తారు. ఫ్రెష్ థాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఎప్పుడూ ఆహ్వానించాలి. ప్యాండమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతి రంగం కుంటుపడింది. సినిమా రంగం కూడా. ఈ ఒక్క సినిమాకే యాభై కోట్ల ఇంటరెస్ట్ పడింది. ప్రభుత్వాలు కనికరించి టికెట్ రేట్లు పెంచుతూ జీవోలు ఇవ్వడం,  మేము అందించిన వినోదానికి ప్రేక్షకులు కొంత ఎక్కువ మొత్తం చెల్లించడం అనేది నష్టాలను భర్తీ చేయడానికే’ అన్నారు.

‘చిరంజీవి గారు, చరణ్ కలిసి డ్యాన్స్ చేసిన సాంగ్ చూశా. చరణ్ చాలా గ్రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో డ్యాన్స్ చేశాడు. అయితే చిరంజీవి గారు ఫేషియల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనూ డ్యాన్స్ చేస్తారు. స్టెప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆటోమేటిగ్గా పడుతుంటాయంతే. ఆ హావభావాల కోసమే మళ్లీ మళ్లీ పాట చూడాలనుకుంటారు’ అంది పూజాహెగ్డే. కొరటాల శివ మాట్లాడుతూ ‘ధర్మం కోసం పాటుపడే రెండు స్ట్రాంగ్ సోల్స్ కథ ఇది. నక్సల్స్, టెంపుల్ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేశామే తప్ప ఆ రెండింటికీ సంబంధించిన ఫిలాసఫీలు, ఐడియాలజీలు లాంటివేమీ సినిమాలో లేవు. టెంపుల్ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండే సిద్ధ అడవికి ఎందుకెళ్లాడు, అడవిలో ఉండే ఆచార్య టెంపుల్ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఎందుకొచ్చాడు అనేది ఆకట్టుకుంటుంది. వీళ్లిద్దరి జర్నీనే తప్ప దేవాలయాల సంరక్షణ, నక్సలిజం సిద్ధాంతాలుండవు. ఇది పూర్తిగా నా ఆలోచనల నుంచి వచ్చిన కథ. ఏ స్ఫూర్తీ లేదు. ప్రచారంలో ఉన్నట్టు దేవాదాయ భూముల గురించిన కథ కూడా కాదు. చరణ్ పాత్ర కోసం మహేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గారిని ఎప్పుడూ అనుకోలేదు’ అని చెప్పాడు.

కథ విన్నప్పుడే క్యారెక్టర్ నాకు పట్టేసింది. అటు ‘ఆర్ఆర్ఆర్’ చేస్తూండటం, ఇటు నాన్నతో కలిసి నటించడం వల్ల కొంత ప్రెజర్ ఉంది. అది నాకు మంచిదే అయింది. ప్రెజర్ ఉంటేనే నేను బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తాను. ఏదేమైనా ‘ఆచార్య’కి నాది ఉడుత సాయమే. వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ గారికి థ్యాంక్స్.
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–  రామ్‌ చరణ్​