అవార్డుల విషయంలో ఇరు ప్రభుత్వాలు పునరాలోచించాలి

అవార్డుల విషయంలో ఇరు ప్రభుత్వాలు పునరాలోచించాలి

తెలుగు రాష్ట్రాలు విడిపోయాక నటీనటులు అవార్డుల విషయంలో నిరాదరణకు గురవుతున్నారని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పునరాలోచించాలని కోరారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి తలసానితో కలిసి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నవంబర్లో నిర్వహించనున్న సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులకు తనవంతు సహకారాన్ని అందిస్తానని చిరు హామీ ఇచ్చారు. 

తెలుగు చిత్ర పరిశ్రమలో నిబ్బద్దతతో పనిచేసే జర్నలిస్టులు ఉన్నారని మంత్రి తలసాని అన్నారు. అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం తనవంతుగా రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచస్థాయి గుర్తింపులో పాత్రికేయుల పాత్ర కీలకమని తలసాని అభిప్రాయపడ్డారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి సైతం సినీ పాత్రికేయుల కృషిని అభినందించారు. ఎల్లవేళలా తెలుగు ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్కు తనవంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు.