రివ్యూ: చిత్రలహరి

రివ్యూ: చిత్రలహరి

రివ్యూ: చిత్రలహరి

రన్ టైమ్: 2 గంటల 10 నిమిషాలు

నటీనటులు: సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శిని, నివేథా పేతురాజ్, పోసాని కృష్ణ మురళి, సునీల్, బ్రహ్మాజీ, వెన్నెలకిషోర్ తదితరులు

సినిమాటోగ్రఫీ:కార్తీక్ ఘట్టమనేని

మ్యూజిక్: దేవీశ్రీ ప్రసాద్

నిర్మాతలు: మైత్రీ మూవీ మేకర్స్

రచన,దర్శకత్వం: కిషోర్ తిరుమల

రిలీజ్ డేట్: ఏప్రిల్ 12,2019

కథేంటి?

సాయి ధరమ్ తేజ్ ఈ మూవీలో విజయ్ క్యారెక్టర్ లో నటించాడు. విజయ్ కెరీర్ లో సక్సెస్ అవ్వలేక తంటాలు పడుతుంటాడు. తను డిజైన్ చేసిన యాప్ కోసం కంపెనీల చూట్టు తిరుగుతుంటాడు. కానీ వాళ్లు రిజెక్ట్ చేస్తారు. కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ టైమ్ బ్యాడ్ వల్ల సక్సెస్ కాలేకపోతుంటాడు. ఇంతలోనే ఓ అమ్మాయితో ప్రేమలో పడుతాడు. ఆ విషయంలో కూడా సెటిల్ అవ్వలేదని ఇబ్బందులు పడుతుంటాడు. మరి చివరికి తన యాప్ ను ఎలా సక్సెస్ చేసుకోగలిగాడు అనేది స్టోరీ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

సాయి ధరమ్ తేజ్ ఈ మూవీలో చాలా సెటిల్డ్ గా నటించాడు. ఇంతకు ముందు సినిమాల్లాగా హడావుడి ఫైట్లు, డాన్సులు లేకుండా డీసెంట్ గా కనిపించాడు. కళ్యాణి ప్రియదర్శిని అందంగా కనిపించింది. నివేతా పేతురాజ్ నటనతో ఆకట్టుకుంది. తండ్రి పాత్రలో పోసాని రాణించాడు. సునీల్ ఫస్టాఫ్ లో నవ్వులు పూయించగా..సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ పండించాడు.

టెక్నికల్ డీటెయిల్స్:

కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రపీ నీట్ గా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ పాటల్లో మూడు పాటలు బాగున్నాయి..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్ కు తగ్గట్టు బాగా కుదిరింది. ఎడిటింగ్ బాగా ఫర్వాలేదు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. కిషోర్ తిరుమల డైలాగులు మెప్పిస్తాయి. ఆ విషయంలో అతన్ని మెచ్చుకోవాల్సిందే.

విశ్లేషణ:

‘‘చిత్రలహరి’’ సినిమా డీసెంట్ ఎంటర్ టైనర్.. సక్సెస్ కోసం తంటాలు పడుతున్న యూత్ అంతా ఈ సినిమాతో బాగా కనెక్టవుతారు. చెప్పుకోవటానికి చిన్న స్టోరీయే అయినా..డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ మూవీని తన డైలాగులు, సీన్లతో నెట్టుకొచ్చాడు. కానీ కథ మీద ఇంకాస్త శ్రద్ద పెట్టి బాగా డీల్ చేసి ఉంటే అందర్నీ మెప్పించి ఉండేది. మూవీ చూస్తున్నంత సేపు టైమ్ పాస్ అయిపోయినా కానీ..బయటకు వచ్చిన తర్వాత ..ఆ పాత్రలతో అంత కనెక్ట్ కాలేకపోతాం..క్యారెక్టర్ ల తో ఆడియన్స్ రిలేట్ చేసుకునేంతగా స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు డైరెక్టర్. ఫస్టాఫ్ అంతా సాఫీగా, ఫన్ గా సాగిపోయిన ‘‘చిత్రలహరి’’కి సెకండాఫ్ లో బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ఎక్కువగా ఆకట్టుకోలేకపోయాయి.  ఓ రెగ్యులర్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుందే తప్ప..మంచి సినిమా చూసామన్న తృప్తి కలగదు. డైలాగులు, కామెడీ, పాత్రల డిజైన్, కొన్ని పాటలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్..కథనం, థిన్ స్టోరి, చివరి ఘట్టాలు ఈ సినిమాకు మైనస్ సాయింట్స్.

బాటమ్ లైన్ : టైమ్ పాస్ కోసం సినిమా చూద్దామనుకుంటే ‘‘చిత్రలహరి’’ కి వెళ్లొచ్చు.