
ఎయిర్ ఇండియాను 100 శాతం ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు కేంద్ర విమానయాన శాఖా మంత్రి హర్ దీప్ సింగ్ పురి. బిడ్డర్లను షార్ట్ లిస్ట్ చేయాలని సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తమ ఛాయిస్ డిజిన్వెస్ట్ మెంట్, మూసివేతల మధ్యే ఉందన్నారు. సంస్థ అమ్ముడుపోకపోతే మూసేస్తామన్నారు. ఎయిర్ ఇండియాపై రోజుకు 20 వేల కోట్ల నష్టం వస్తుందని..ఇప్పటికి 60వేల కోట్ల అప్పు ఉందని చెప్పారు. ప్రైవేటీకరణకు సంబంధించిన బిడ్డర్ల ప్రక్రియ పూర్తయ్యేందుకు 64 రోజుల సమయం పడుతుందన్నారు.