9 నుంచి  ‘ఛూ మంతర్’ : వేణు

9 నుంచి  ‘ఛూ మంతర్’ :  వేణు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో 3 రోజుల పాటు ‘ఛూ మంతర్’ కార్యక్రమం నిర్వహిస్తామని ఇంటర్నేషనల్​ మెజీషి యన్స్​ కన్వెన్షన్​ చైర్మన్​ సామల వేణు తెలిపారు. శనివారం ‘ఛూ మంతర్​ 2023’ పోస్టర్​ను కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాల ను వేణు ప్రకటించారు. 9 నుంచి 11 వరకు హైదరాబాద్​లోని హరిహర కళా భవన్​లో ఛూమంతర్​ 12వ జాతీయ, అంతర్జాతీయ మెజీషియన్స్  కన్వెన్షన్​నిర్వహిస్తామని తెలిపారు.

చీఫ్​ గెస్ట్​గా కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి హాజరవుతారని చెప్పారు. వివిధ దేశాలకు చెందిన 500 మంది మెజీషియన్లు ఈ సదస్సులో పాల్గొంటారని పేర్కొన్నారు. మ్యాజిక్​పై లెక్చర్లు, డెమోలు, సెమినార్లు, మెజీషి యన్ల మధ్య పోటీలు ఉంటాయని, మ్యాజిక్​కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోనే ఇది పెద్ద సదస్సు అని చెప్పా రు. 1996 నుంచి ఛూ మంతర్​ నిర్వహిస్తున్నామని వేణు వెల్లడించారు.