చొప్పదండి ఎమ్మెల్యే కాన్వాయ్ కు తప్పిన ప్రమాదం

చొప్పదండి ఎమ్మెల్యే కాన్వాయ్ కు తప్పిన ప్రమాదం
  • మూడు కార్లు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు
  • జగిత్యాల జిల్లా పూడూరు శివారులో ఘటన 

కొడిమాల,వెలుగు: జగిత్యాల జిల్లాలో కార్లు ఢీ కొనడంతో చొప్పదండి ఎమ్మెల్యే కాన్వాయ్ కు ప్రమాదం తప్పింది. ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ నుంచి కొండగట్టు వైపు వెళ్తున్నారు. కొడిమ్యాల మండలం పూడూరు శివారులో ఆయన కారు వెనకాల వెళ్లే వాహనాలు ఎదురుగా మరో కారును ఢీకొట్టాయి. దీంతో మూడు వాహనాల ముందుభాగాలు ధ్వంసమై ఎయిర్‌‌‌‌‌‌‌‌ బ్యాగులు తెరుచుకున్నాయి. 

ఘటనలో గంగాధర వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ తీవ్రంగా గాయపడగా, కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యాక్సిడెంట్ పై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సందీప్ తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రయాణిస్తున్న కారుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.