- చొప్పదండి ఎమ్మెల్యే సత్యం
చొప్పదండి, వెలుగు: చొప్పదండి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా చేసి చూపిస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి అడిషనల్కలెక్టర్అశ్విని తానాజీ వాకడేతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. అనంతరం రైతు వేదికలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొత్తూరు మహేశ్, తహసీల్దార్నవీన్కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పాల్గొన్నారు.
కేసీఆర్ ఇచ్చిన చీరలను ఒక్క ఆడబిడ్డ కట్టలే..
మల్యాల/కొడిమ్యాల, వెలుగు: రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలందరికీ పట్టుచీరలు అందజేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. మల్యాల, కొడిమ్యాల మండలకేంద్రాల్లో సోమవారం మహిళలకు ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
గతంలో కేసీఆర్ సర్కార్ ఇచ్చిన చీరను ఏ ఒక్క ఆడబిడ్డ కట్టుకోలేదని ఎద్దేవా చేశారు. అంతకుముందు కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలో 2.5 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు భూమిపూజ చేశారు. ఆయా కార్యక్రమాల్లో స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో శ్రీనివాస్, మల్యాల ఏఎంసీ చైర్‌పర్సన్ మల్లీశ్వరి, లీడర్లు ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, మేన్నెని రాజనర్సింగరావు, ప్రభాకర్ రెడ్డి, నారాయణ, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
