ఐదు రోజుల పాటు చౌమహల్లా మూత

ఐదు రోజుల పాటు చౌమహల్లా మూత

హైదరాబాద్​ లోని చౌమహల్లా ప్యాలెస్ను 5 రోజులపాటు మూసివేయనున్నారు. ఎనిమిదో నిజాం ముకరంజా బహదూర్ టర్కీలోని ఇస్తాంబుల్ లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను హైదరాబాద్​ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మక్కా మసీదు ఆవరణలో సన్నాహాలు ప్రారంభమయ్యాయి. చౌమహల్లా ప్యాలెస్ లో ఐదు రోజుల పాటు నిజాం నవాబుల బంధువులు, స్నేహితుల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో సందర్శకులను అనుమతించబోమని నిర్వాహకులు స్పష్టం చేశారు. చౌమహల్లా ప్యాలెస్ నిజాం నవాబు నివాస భవనం. దీనిని 1750లో నిర్మించారు. నాలుగు మహళ్ల సముదాయమే ఈ చౌమహల్లా ప్యాలెస్.