ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

క్రిస్మస్​ వేడుకలు ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  క్రైస్తవులు కేట్​కట్ ​చేశారు. నిర్మల్​లో జరిగిన వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి పాల్గొన్నారు. క్రీస్తు  బోధనలు అచరణీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, కౌన్సిలర్లు ఎస్పీ రాజు, బిట్లుంగు నవీన్, బీఆర్ఎస్​ టౌన్  ప్రెసిడెంట్ మార్గొండ రాము పాల్గొన్నారు. ఆసిఫాబాద్​లో జరిగిన వేడుకల్లో జడ్పీ చైర్ ​పర్సన్ ​కోవ లక్ష్మి పాల్గొన్నారు. బెల్లంపల్లి కల్వరి చర్చిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, ఏఎంసీ చైర్మన్  బోనగిరి నిరంజన్ గుప్తా, బీఆర్ఎస్ స్టేట్ లీడర్లు విజయ, రవి పాల్గొన్నారు. సింగరేణి కార్మిక క్షేత్రంలో క్రిస్మస్​ ఘనంగా నిర్వహించారు. సింగరేణి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజారమేశ్​ మిత్ర బృందం క్రిస్మస్​ ప్రేమ విందు(లవ్​ఫెస్ట్​) కోసం  రూ.1.50లు అందజేశారు. - వెలుగు నెట్​వర్క్

సీఎం రిలీఫ్​ ఫండ్​చెక్కు అందజేత

లోకేశ్వరం,వెలుగు: లోకేశ్వరం మండలం బిలోలి గ్రామానికి చెందిన ఆర్.సాయన్న ఇటీవల అనారోగ్యం పాలయ్యాడు. పేద కుటుంబానికి చెందిన ఆయన సీఎం రిలీఫ్​ఫండ్​కోసం విన్నవించగా ఇటీవల మంజూరైంది. ఆదివారం ఎమ్మెల్యే విఠల్​రెడ్డి లబ్ధిదారునికి చెక్కు అందిచారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సింగ్ రావు, ఉప సర్పంచ్ భోజన్న, ఎంపీటీసీ సాయారెడ్డి, లీడర్లు రవీందర్ రావు, నర్సింగ్ రావు, రాజు, గంగన్న, కాంతారావు, శ్రీనివాస్ రావు, నర్సింగ్ రావు, భూమేశ్, రాజశేఖర్ రావు, గారు ఉన్నారు.

దళిత బంధు అందరికి ఇవ్వాలి

బజార్ హత్నూర్, వెలుగు: అర్హులైన దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ ఆదివారం మండలంలోని గిర్నూర్ దళితులు నిరసన వ్యక్తం చేశారు. ఇంతవరకు గ్రామానికి కేవలం మూడు యూనిట్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్సీ కాలనీ దళిత యువకులు తదితరులు  పాల్గొన్నారు.

ఘనంగా వాజ్​ పేయి​ జయంతి

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా వ్యాప్తంగా ఆదివారం మాజీ ప్రధాని వాజ్​ పేయి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆదిలాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో  బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​ పాల్గొన్నారు.  శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో కార్మికులకు క్రికెట్​ పోటీలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​ వెరబెల్లి పోటీలు ప్రారంభించారు.  కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రజినీశ్​  జైన్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకట కృష్ణ,  సత్రం రమేశ్, ఈర్ల సదానందం, మధు, సతీశ్​ రావు, మాధవరపు రమణా రావు, జోగుల శ్రీదేవి, కొండ వెంకటేశ్ పాల్గొన్నారు. నిర్మల్​లో పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రాంనాథ్, లోక్ సభ ఇన్​చార్జి భూమయ్య,  జిల్లా ప్రధాన  కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆసిఫాబాద్​లో జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్నాక్​ విజయ్ పాల్గొన్నారు. రామకృష్ణాపూర్​, మందమర్రిలో బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్లు మహంకాళి శ్రీనివాస్​, సప్పిడి నరేశ్​ ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. జిల్లా జనరల్​ సెక్రటరీ అందుగుల శ్రీనివాస్​ పాల్గొన్నారు.– వెలుగు నెట్​వర్క్

కలెక్టర్ క్యాంప్ ఆఫీస్​లో అయ్యప్ప పడిపూజ

ఆసిఫాబాద్​ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్​లో కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో పడిపూజ నిర్వహించారు. కలెక్టర్ సతీమణి శ్రీజ కుంకుమార్చన పూజ చేశారు.కార్యక్రమంలో వేదపండితులు మసునూరి భాస్కర శర్మ, సాయి కిరణ్ శర్మ, ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్​కోవలక్ష్మి, అడిషనల్ కలెక్టర్​చాహత్ బాజ్ పేయ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశ్, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.- ఆసిఫాబాద్,వెలుగు 

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత

నిర్మల్, వెలుగు: ఆధ్యాత్మికతతో మానిసిక ప్రశాంతత లభిస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మల్లన్నగుట్ట హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయ వజ్రోత్సవ వేడుకలు, దేవరకోట ఆలయం లక్ష్మీవేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలోని షాపింగ్ కాంప్లెక్స్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధం గా  రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రూ.100 కోట్లతో 600కుపైగా ఆలయాలు పునఃరుద్ధరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ మంత్రి సతీమణి అల్లోల విజయలక్ష్మి, హరిహర క్షేత్రం ధర్మకర్తలు అల్లోల మురళీధర్ రెడ్డి వినోదమ్మ, గురుస్వామి మూర్తి, వేణుగోపాల్ రెడ్డి, దేవరకోట ఆలయ  చైర్మన్ లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీలో పలువురిచేరిక

మంచిర్యాల,వెలుగు: యువత బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​వెరబెల్లి పేర్కొన్నారు. ఆదివారం రాజీవ్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీకి చెందిన 100 మంది మహిళలు , యువకులు బీజేపీలో చేరారు. వారిని పార్టీ  కండువా కప్పి రఘునాథ్​పార్టీలోకి  ఆహ్వానించారు. ఈ సందర్భంగా యాన మాట్లాడుతూ యువకులకు బీజేపీ ప్రాధాన్యత ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషిచేయాలన్నారు. అనంతరం ఆయన మాజీ ప్రధాని వాజ్​పేయి ఫొటోకు పూలమాల వేసి జయంతి ఘనంగా 
నిర్వహించారు.

దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం

ఆదిలాబాద్​ టౌన్,వెలుగు: దేశానికి కేసీఆర్​నాయకత్వం అవసరమని బీఆర్ఎస్​జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న చెప్పారు. ఆదివారం ఆదిలాబాద్ రూరల్ మండలం చించూఘాట్​గ్రామానికి చెందిన బీజేపీ లీడర్లు, పలువురు యువకులు, గ్రామస్థులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, ఎంపీపీ గండ్రత్ రమేశ్, వైస్ ఎంపీపీ జంగు పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్​కె.విజయలక్ష్మి, వైస్ చైర్మన్ రమేశ్, లీడర్లు మెట్టు ప్రహ్లాద్, సెవ్వ జగదీశ్​యాదవ్, రమణ, రాజు తదితరులు పాల్గొన్నారు. 

బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం

ఆసిఫాబాద్,వెలుగు:బీఆర్ఎస్​తోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుదని జడ్పీ చైర్​ పర్సన్​ కోవ లక్ష్మి చెప్పారు. ఆదివారం పట్టణంలోని హట్కో కాలనీ, కంట కాలనీలోని మైనారిటీలు జడ్పీ చైర్​ పర్సన్​ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వీరికి కండువా కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, లీడర్లు అహ్మద్​బిన్ అబ్దుల్లా, నిసార్, జావిద్​తదితరులు పాల్గొన్నారు.